NDA నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో జాబ్స్​

NDA నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో జాబ్స్​

దేశానికి సేవ చేయడంతోపాటు మంచి ఉద్యోగంలో  స్థిరపడాలనుకునే వారి కోసం  యూనియన్‌‌ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌(యూపీఎస్సీ) ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌‌డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2024 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది.

ఖాళీలు: మొత్తం 404 ఖాళీలకు ప్రకటన వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ  పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 34 ఉన్నాయి. 

కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌‌వుతారు.  

అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్​: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌‌ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో జూన్​ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష సెప్టెంబర్​ 1న నిర్వహిస్తారు. కోర్సులు 2 జూలై 2025 నుంచి ప్రారంభం అవుతాయి. వివరాలకు www.upsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.