దేశంలో జూన్ 1వ తేదీ శనివారం సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తుది ఫలితాలు జూన్ 4 న వెలువడనున్నాయి. ఈ రోజు చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగియండంతో దేశంలోని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి.
ఎగ్జిట్ పోల్స్ వివరాలు
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్:
ఎన్డీఏ: 359
ఇండియా కూటమి: 154
ఇతరులు: 30
ఇండియా న్యూస్-డైనమిక్:
ఎన్డీఏ:377
ఇండియా కూటమి: 151
ఇతరులు: 15
రిపబ్లిక్ భారత్-మాట్రిజ్:
ఎన్డీఏ: 360
ఇండియా కూటమి: 125
ఇతరులు: 46
న్యూస్ నేషన్:
ఎన్డీఏ: 340-378
ఇండియా కూటమి: 153-169
ఇతరులు: 21-23