నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీ ఆధ్వర్యంలో చెన్నైలో సెప్టెంబర్ 18 నుంచి రెండ్రోజులపాటు జాతీయ సెమినార్ ఎక్సర్‌సైజ్ ఐక్య నిర్వహించనున్నారు. సహజసిద్ధంగా సంభవించే ప్రకృతి విపత్తుల సంసిద్ధతను ప్రోత్సహించడం, కీలకమైన భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఈ సెమినార్లో సునామీ, కొండచరియలు విరిగిపడటం, వరదలు, కార్చిచ్చు, తుపాన్లు తదితర ప్రకృతి విపత్తులు, ఇటీవల సంభవించిన విపత్తులను సమీక్షిస్తారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నిరోధించే పరిష్కార మార్గాల గురించి చర్చలు జరుగుతాయి.
ప్రకృతిలో సంభవించే సహజసిద్ధ విపత్తులను ముందుగానే అంచనా వేసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, పర్యావరణ వేత్తలు పాల్గొని పరస్పరంగా పరిష్కార మార్గాలను, సూచనలు, సలహాలు ఇచ్చారు.