ఛత్రపతి శివాజీ అందరి వాడు : అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...

ఛత్రపతి శివాజీ అందరి వాడు  :  అటవీ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి...

నిర్మల్, వెలుగు: ఛత్రపతి శివాజీ అందరివాడని ఆయన విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  గాజులపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. శివాజీ మహారాజ్ పూర్తిగా

 సెక్యులర్ భావాలతో రాజ్యపాలన సా గించాడని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ ఆయనను ఒక వర్గానికి పరిమితం చేస్తున్నారన్నారు.  చౌకబారు రాజకీయాలను బీజేపీ నేతలు మానుకోవాలన్నారు.  నిర్మల్ శివాజీ చౌక్ లో రూ. 50 లక్షలతో కాంస్య  విగ్రహం ఏర్పాటు చేసింది తామేనన్నారు.  బీజేపీ తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనలేదన్నారు.  మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.