వరదలో చిక్కుకుని.. చెట్టుపైనే 24 గంటలు

హెలికాఫ్టర్ తో రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
మధ్యప్రదేశ్‌లోని చిండ్వారా జిల్లాలో ఘటన

భోపాల్: ఒకవైపు పోటెత్తుతున్న వరద నీళ్లు.. మరోవైపు చిమ్మచీకటి.. అలాంటి పరిస్థితుల్లోనూ 24 గంటలపాటు ఒక చెట్టును పట్టుకుని గడిపాడో వ్యక్తి. చివరికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్ఆడీర్ఎఫ్) సిబ్బంది హెలికాప్టర్ సాయంతో అతడిని కాపాడారు. మధ్యపదేశ్లోని చిండ్వారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బెల్ ఖేడా గ్రామానికి చెందిన మధు కహర్.. తన ఫ్రెండ్స్తో కలిసి పెంచ్ నదిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. కానీ భారీ వర్షాలకు మచ్చ గోరా డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఓపెన్ చేశారు. దీంతో నదిలో వాటర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఫ్రెండ్స్ అంతా ఏదోలా తప్పించుకుని గట్టుకు చేరగా మధు మాత్రం.. నీటిలో కొట్టుకుపోయాడు. చివరికి ఎలాగోలా ఓ చెట్టును పట్టుకుని ఆగాడు. తనను ఎవరైనా రక్షిస్తారని చాలాసేపు సాయం కోసం అరిచాడు. అయితే అప్పటికే చీకటి పడటం.. రాత్రి కావడంతో ఎవరూ అతడిని గుర్తించలేదు. దీంతో రాత్రంతా అలా భయంభయంగా చెట్టుమీదే గడిపాడు. చివరికి ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అతను ఉన్నచోటుకు బోటువెళ్లే పరిస్థితి లేకపోవడంతో హెలికాప్టర్ను రప్పించి అతడిని తాడు సాయంతో కాపాడారు.

For More News..

వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పెరగాలే

ఓల్డెస్ట్ మ్యారిడ్ కపుల్ గా గిన్నిస్ రికార్డ్

ఆసియాలోనే ఫస్ట్ టైం.. చనిపోతూ కరోనా పేషెంట్‌కు ప్రాణం పోసిండు