మోరంచపల్లి : కళ్లముందే 20 మంది కొట్టుకుపోయిన్రు

జయశంకర్ భూపలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామప్రజలను సురక్షితంగా తరిలించే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటికే బోట్ల ద్వారా చాలా మందిని తరలించారు.  మరికొంతమందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు.  NDRF సిబ్బంది రంగంలోకి దిగాయి. గ్రామంలోని అందిరిని  తీసుకువస్తామని సిబ్బంది చెబుతున్నారు.  అయితే వరద బీభత్సానికి కొట్టుకుపోయిన నలుగురి కోసం ఇంకా గాలిస్తున్నారు.  

అర్థరాత్రి 2 గంటల నుంచి భారీ వర్షం పడుతోందని, 4 గంటల అయ్యేసరికి ఇంట్లోకి వర్షపు నీరు రావడం చేరిందని , బైక్స్ ,కార్లు కొట్టుకుపోవడం స్టార్ట్ అయ్యాయని మోరంచపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.  తమ ఇంటిపక్కన ఉన్న 20 మంది తమ కళ్లముందే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలిపారు.  వారిని కాపాడే ప్రయత్నం చేసినవారు కూడా కొట్టుకుపోయారని  తెలిపారు.  ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.   రాత్రి 10 గంటల నుంచి భారీ వర్షం పడుతుంటే అధికారులకు ఫోన్  చేస్తే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు.  

రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇండ్లన్నీ నీటమునిగాయి.  వరదలో ఇంకెవరైనా చిక్కుకున్నారేమోననని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మోరంచపల్లిలో రెండు ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.