సీసీ బ్లాక్​లు కొట్టుకుపోతే ఏజెన్సీపై ఏం చర్యలు తీసుకున్నరు?

  • బ్యారేజీలో పిల్లర్ల వద్ద క్రాక్స్ ఉన్నయా?
  •     లోకల్ ఇంజినీర్లను ప్రశ్నించిన ఎన్ డీఎస్ఏ నిపుణుల కమిటీ
  •     అన్నారంలో మూడు గంటలు, సుందిళ్ల దగ్గర 2 గంటల పాటు విచారణ 
  •     బ్యారేజీల అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర పరిశీలన
  •     ఇయ్యాల్టి  నుంచి పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భూపాలపల్లి/మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌/వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా కట్టిన మూడు బ్యారేజీల వద్ద నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సేఫ్టీ అథారిటీ  (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) నిపుణుల కమిటీ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పూర్తయింది. శుక్రవారం అన్నారం బ్యారేజీ దగ్గర మూడు గంటల పాటు, సుందిళ్ల బ్యారేజీ వద్ద రెండు గంటల పాటు అధికారులు ఎంక్వైరీ చేశారు. కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్వాలిటీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లలో పనిచేసిన ఇంజినీర్లు‌‌‌‌‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థకు సంబంధించిన వాళ్లను శనివారం నుంచి వ్యక్తిగతంగా ప్రశ్నించనున్నారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అయ్యర్, సభ్యులు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  శర్మ,  రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమితాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీనా తదితరులు శుక్రవారం ఉదయం 10 గంటలకే అన్నారం బ్యారేజీపైకి చేరుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంక్వైరీ చేశారు. బ్యారేజీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. 

అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎందుకు కొట్టుకుపోలే, డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎందుకు కొట్టుకుపోయిందని ప్రశ్నించారు. బ్యారేజీలో సీపేజీలు ఏర్పడిన (బుంగలు పడ్డ) 44, 35, 28, 38 పిల్లర్ల దగ్గర లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇంజినీర్లు ముగ్గు పోసి జెండా కట్టెలు పాతి పెట్టారు. 5 గేట్ల దగ్గర ఇసుక తీసేసి చూపించారు. అలాగే డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టుకుపోయిన సీసీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలిసేలా జెండాలు పాతిపెట్టారు. ముగ్గు కూడా పోసి ఉంచారు. లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లపై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కమిటీ మెంబర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. 

బ్యారేజీలో ఊటలు ఎప్పుడొచ్చినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?  కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విధానం ఏమిటి? సీసీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టుకుపోయినప్పుడు ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బ్యారేజీలో పిల్లర్ల దగ్గర ఏమైనా క్రాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయా? గేట్ల నుంచి ఎంత వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నరు? నీళ్లు విడుదల చేయాలని మీకు ఎవరు ఆదేశాలిస్తరు? అని కమిటీ మెంబర్లు లోకల్  ఇంజినీర్లను ప్రశ్నించారు. అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గేట్ల దగ్గర మేటలు వేసి ఉన్న ఇసుకను చూసి ప్రశ్నించారు. 2023లో వచ్చిన వరదల వల్ల గేట్ల కింద ఉన్న బీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దగ్గర 3, 4 ఫీట్ల మేరకు ఇసుక మేటలు వేశాయని, ఇది గోదావరి వరద ప్రభావం వల్ల జరిగిందని ఈఈ యాదగిరి సమాధానమిచ్చారు. 

సాధ్యమైనంత వరకు ఇసుక మేటలు తొలగించామని చెప్పారు. బ్యారేజీ దిగువన ఎంత మేరకు ఇసుక‌‌‌‌‌‌‌‌ ఉందో చెప్పాలని ప్రశ్నించగా సుమారు 40 మీటర్ల లోతు వరకు ఇసుక ఉందని ఈఈ చెప్పారు. గతంలో ఐఐటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వాళ్లు ఇచ్చిన టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రిపోర్టులను‌‌‌‌‌‌‌‌ చూపించారు. బుంగలు పడిన చోట కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ చేయాలని ఎవరు చెప్పారు? దాని లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంత? ఈ పనిచేయడానికి ఏజెన్సీకి పేమేంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారు? అని అడిగారు. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన మూడు డ్రాయింగ్లు చూశారు. తర్వాత సుందిళ్ల బ్యారేజీ పరిశీలనకు వెళ్లారు. అక్కడ బ్యారేజీలో 1.5 టీఎంసీల నీళ్లు నిల్వచేసి ఉండడంతో ఎక్కువ సేపు ఎంక్వైరీ చేయలేకపోయారు. రెండు గంటల పాటు విచారణ జరిపి వెళ్లిపోయారు. 

నేటి నుంచి వ్యక్తిగతంగా విచారణ

భూమిలోకి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, బుంగలు పడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు నిర్ణయించడానికి గత మూడు రోజులుగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ జరుపుతోంది. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జలసౌధలో రాష్ట్ర స్థాయి ఆఫీసర్లతో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురు, శుక్రవారాలలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ మూడు బ్యారేజీల నిర్మాణ సమయంలో పనిచేసిన కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్వాలిటీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సంస్థ ఇంజినీర్లను శనివారం నుంచి బృందం అధికారులు వ్యక్తిగతంగా‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  శాఖకు సమాచారం ఇవ్వడంతో ఇంజినీర్లంతా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.