హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన బోర్హోల్ డేటాను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే ఎన్ డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చేందుకు వీలవుతుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ చెప్పారు. జియోటెక్నికల్ డేటా రానంతవరకూ ఎన్డీఎస్ఏ నివేదిక సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ అనంతరం వెదిరె శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద గ్రౌటింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి లేకుండా పోయిందని, సుందిళ్ల వద్ద చేయమంటే నీళ్లున్నాయని చెబుతున్నారని పేర్కొన్నారు.