అన్నారం బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బ్యారేజ్ లను రెండో రోజు పరిశీలిస్తుంది నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ టీమ్. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజీ  చేరుకుంది NDSA బృందం. మార్చి 7వ తేదీ గురువారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు సెంట్రల్ టీం సభ్యులు.

ALSO READ :- రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

 7 గంటల పాటు మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాత్రి రామగుండంలో బస చేసి.. మార్చి 8వ తేదీ శుక్రవారం ఉదయం అన్నారం చేరుకుని బ్యారేజీని పరిశీస్తున్నారు NDSA సభ్యులు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో బుంగలను పరిశీలించింది టీమ్. తర్వాత బ్యారేజ్ 5 బ్లాక్ లోని 38వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ ను స్థానిక అధికారులతో సాయంత్రం పరిశీలించనున్నారు NDSA టీం సభ్యులు.