నిజాంపేటలో కుంగిన రోడ్డు

కూకట్​పల్లి, వెలుగు : నిజాంపేటలోని లలిత జ్యువెలరీ షోరూం సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ఒక్కసారిగా కుంగింది. జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనాదారులకు ఇదే ప్రధాన రహదారి. రోడ్డు కుంగిన చోట అండర్​ గ్రౌండ్​డ్రైనేజీ పైపులైన్ ఉంది. పైప్​లైన్​లీకేజీ కారణంగా రోడ్డు కుంగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ కూకట్​పల్లి సర్కిల్ అధికారులు, సిబ్బంది రిపేర్లు చేపట్టారు.