
భారీ వానలు..మహారాష్ట్ర నుంచి భారీగా వరదలతో నిజామాబాద్ జిల్లా సరిహద్దులో మంజీరా నది ఉరకలేస్తోంది. సాలురా వద్ద మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. సాలురా వద్ద గల పాత బ్రిడ్జి పైనుండి మంజీర ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర లకు రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా నది ఉగ్రరూపం దాల్చినా..అధికారులు మాత్రం ఎలాంటి సూచికలు పెట్టలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజీరా నది వరకు వెళ్లి వెనక్కు రావాల్సిన పరిస్థితి నెలకొంది.