- 487 మంది మృతి
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మూడో స్థానంలో ఉన్న రష్యాను కూడా మన దేశాం దాటేసింది. కాగా.. 24 గంటల్లో 24,879 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,67,296కి చేరింది. ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ గురువారం ఉదయం బులిటెన్ రిలీజ్ చేసింది. దాదాపు 4.7లక్షల మంది పేషంట్లు కరోనాను జయించారు. 24 గంటల్లో 487 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 21,129కి చేరింది. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 62 శాతంగా ఉంది. ఇక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 6603 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,23,724కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 9448 మంది చనిపోయారు. తమిళనాడులో ఒక్కరోజే 3756 మంది వ్యాధి బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కి చేరింది. 1700 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. 2033 కొత్త కేసులతో బాధితుల సంఖ్య 1,04,864కి చేరింది. 3213 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.