నీట్ పీజీ 2021 షెడ్యూల్ విడుదల

నీట్ పీజీ 2021 ప‌రీక్ష తేదీని ఖ‌రారు చేస్తూ నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ 2021 ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ఈ తేదీని ఖరారు చేసింది. ఊహించని పరిణామాలు ఎదురైతే ఈ పరీక్ష తేదీని మార్చే అవకాశముంటుందని బోర్డు తెలిపింది. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం nbe.edu.in లేదా natboard.edu.in వెబ్‌సైట్లను సందర్శించోచ్చని బోర్డు తెలిపింది.

అర్హతలు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) చేత గుర్తించబడిన ఇన్స్టిట్యూట్ జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్వత ఎంబిబిఎస్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అభ్యర్థులు ఎంసిఐ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి

నీట్ పిజి 2021 రాసే అభ్యర్థలు జూన్ 30, 2021లోపు ఒక సంవత్సరం పాటు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసి ఉండాలి.

For More News..

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. తొమ్మిది జిల్లాలో వ్యాప్తి

ఇండోనేషియాలో భారీ భూకంపం

మొదలైన నాలుగో టెస్ట్.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్