NED vs RSA: నెదర్లాండ్స్ విజయం వెనుక మన దేవుడు.. వీర హనుమాన్

NED vs RSA: నెదర్లాండ్స్ విజయం వెనుక మన దేవుడు.. వీర హనుమాన్

నెదర్లాండ్స్‌ జట్టును తక్కువ అంచనా వేసిన సౌతాఫ్రికా జట్టు.. ఎంతటి పరాభవాన్ని మూటగట్టుకుందో మనందరం చూశాం. ఏముందిలే అన్నట్లు అలసత్వం వహించడమే ఈ  మ్యాచ్‌లో వారి ఓటమికి ప్రధాన కారణం. 82/5 స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయిన డచ్ బ్యాటర్లను.. 245 స్కోర్ కొట్టేలా చేశారంటే మ్యాచ్‌ను వారు ఎంత తేలిగ్గా తీసుకున్నారో అర్థం చేసుకోవాలి. మొదట బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ విఫలమైన సఫారీ బ్యాటర్లు.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించలేక ఓటమి అంగీకరించారు. 

సారథి అనిపించాడు

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన డచ్ బ్యాటర్లను.. సౌతాఫ్రికా పేస్ దళం వణికించిందనే చెప్పాలి. రబడా, ఎంగిడి, జాన్ సెన్.. ముగ్గురూ లైన్ అండ్ లెంగ్త్ బంతులతో వారిని భయపెట్టారు. వరుసగా వికెట్లు తీస్తూ.. పరుగులు రాకుండా బాగానే కట్టడి చేశారు. ఇదంతా 30 ఓవర్ల వరకే. అక్కడినుండి మ్యాచ్ నెదర్లాండ్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది.  

82పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న నెదర్లాండ్స్‌ బాధ్యతను  కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ తీసుకున్నారు. 69 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 78 నాటౌట్‌ పరుగులు చేసి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం గెలిపించే బాధ్యతను బౌలర్లు తీసుకొని.. సఫారీలను 38 పరుగుల తేడాతో మట్టికరిపించారు. నెదర్లాండ్స్ జట్టు సాధించిన ఈ  విజయం వెనుక వీర హనుమాన్ ఉన్నట్లు వెలుగు లోకి వచ్చింది. 

ALSO READ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..టాప్ లేపిన ఇండియన్ బ్యాటర్లు

వీర హనుమాన్

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు రెండు రోజులు ముందుగానే ధర్మశాల చేరుకున్న నెదర్లాండ్స్‌ బృందం అక్కడ కొన్ని ప్రదేశాలను సందర్శించింది. ఆ సమయంలో ఎడ్వర్డ్స్‌.. హనుమాన్ ఆలయాన్ని సందర్శించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను అతడే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో అవి వైరల్‌గా మారాయి. డచ్ విజయానికి హనుమాన్‌ని సందర్శించడమే కారణమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.