శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. డచ్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్.. 262 పరుగులు చేయగలిగిందంటే అది ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్ వల్లే. వీరిద్దరూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయటమే కాదు.. లంకేయుల ఎదుట పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించగలిగారు. ఈ క్రమంలో ఈ జోడి 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఎంగెల్‌బ్రెచ్ట్ - లోగాన్ వాన్ బీక్ జోడి ఏడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం. గతంలో ఈ రికార్డు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోనీ- రవీంద్ర జడేజా పేరిట ఉండేది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 2019లో న్యూజిలాండ్‌పై 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అది 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోయినా.. వీరిద్దరి పోరాటం ఒక అధ్యాయమనే చెప్పాలి. కివీస్ నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 221 పరుగుల వద్ద ఆలౌటైంది.
The men who stood up when the seas were rough. ?
— Cricket?Netherlands (@KNCBcricket) October 21, 2023
Sybrand Engelbrecht and Logan Van Beek stitched a big partnership in the middle overs to take us to a fighting total.#NedvSL #CWC23 pic.twitter.com/SDp66jjPhT
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి.. మరో పది బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను ముగించింది.
Sybrand Engelbrecht - 70(82).
— CricketMAN2 (@ImTanujSingh) October 21, 2023
Logan Van Beek - 59(75).
Netherlands at one point 91/6 and now they finish on 262 runs against Sri Lanka in this World Cup - One of the finest Comebacks in World Cup history...!!! pic.twitter.com/vQHqnXWEGC