బ్యాడ్మింటన్ లో నేషనల్స్​కు సెలక్ట్​ కావాలి : బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎస్ జీఎఫ్ స్టేట్ మీట్ లో సత్తా చాటాలని, నేషనల్​ స్థాయిలో పోటీ పడాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మిర్యాలగూడ లో ఎన్ ఎస్పీ క్యాంప్ లోని ఇండోర్ స్టేడియంలో మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ సెలక్షన్ పోటీలను మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి ప్రారంభించారు. 

క్రీడాకారులు నేషనల్ టోర్నీకి ఎంపిక కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బాలాజీ నాయక్,బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులు వాసు దేవ్ రావు , కోచ్ మారబోయిన రామకృష్ణ, డాక్టర్లు అంజయ్య, కౌన్సిలర్లు గంధం రామకృష్ణ జాని పాష, ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.