సర్ ప్లస్ టీచర్లపై కీలక నిర్ణయం

సర్ ప్లస్ టీచర్లపై కీలక నిర్ణయం
  • అవసరం ఉన్నచోటుకి సర్ ప్లస్ టీచర్లు
  • దాదాపు 860 మందికి పైగా షిఫ్ట్

హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్లకు సర్ ప్లస్ టీచర్లను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అందులో భాగంగా దాదాపు 860 మందికి పైగా టీచర్లను ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రైమరీ పాఠశాలలు అప్పర్ ప్రైమరీకి అప్ గ్రేడ్ అయ్యాయి. అలాగే.. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ అయ్యాయి.  కొన్నిచోట్ల కొత్త ప్రైమరీ స్కూళ్లు కూడా ఏర్పాటయ్యాయి. దాంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను షిష్ట్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా..రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వారీగా డేటాను పంపించాలని ఈ నెల 15న డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. ఆ జాబితా ఆధారంగానే టీచర్ల కొరత ఉన్న చోటకు సర్ ప్లస్ ఉన్న టీచర్లను షిఫ్ట్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.