![పోరాట ధీరుడు పండగ సాయన్న](https://static.v6velugu.com/uploads/2025/02/neelam-madhu-about-pandaga-sayanna_gdsiM695hK.jpg)
షాద్ నగర్, వెలుగు: దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఆకలితో అల్లాడుతున్న పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని కాంగ్రెస్ నాయకుడు నీలం మధు అన్నారు. నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం మహల్ ఎలికట్ట లో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.
నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేశ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య, నాయకులు ఈట గణేశ్, మంగ వెంకటేశ్ పాల్గొన్నారు.