
- పలుచోట్ల అన్నదానాలు, పండ్ల పంపిణీ
- ఎన్ఎంఆర్ అభిమానుల రక్తదానం, సేవాకార్యక్రమాలు
పటాన్చెరు, వెలుగు: కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ బర్త్డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు బర్త్ డే కేకులు కట్ చేసి సంబరాలు జరిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జిన్నారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు.
పటాన్ చెరు పట్టణంలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. పటాన్ చెరు మండలం రుద్రారంలో ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు మన్నె ప్రశాంత్ ఆధ్వర్యంలో పదో తరగతి స్టూడెంట్స్కు జామెట్రీ బాక్స్, పెన్నులు అందించారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం దాచర్లపల్లి, సిరిసిల్ల జిల్లా మాడేపల్లిలో ఎన్ఎంఆర్ అభిమానుల అనాథశ్రమాలలో అన్నదానం చేశారు.
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్ఎంఆర్ అభిమానులు రక్తదానం చేశారు. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, నీలం అభిమానులు పాల్గొన్నారు.
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మధు
మెదక్: తన బర్త్డే సందర్భంగా ముంబైలోని సిద్ధి వినాయకుడిని మెదక్ కాంగ్రెస్నేత నీలం మధు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధు మాట్లాడుతూ..ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో ముంబై సిద్ధి వినాయక ఆలయం ఒకటని, ఇక్కడి గణేశుడు కోరిన కోర్కెలను తీరుస్తాడని చెప్పారు. ఆయన ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు చెప్పారు.