బీసీ కులగణన చరిత్రలో నిలిచిపోతుంది :నీలం మధు ముదిరాజ్

బీసీ కులగణన చరిత్రలో నిలిచిపోతుంది :నీలం మధు ముదిరాజ్
  •    సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నీలం మధు ముదిరాజ్

పటాన్​చెరు, వెలుగు:  దేశంలో ఎక్కడా  లేని విధంగా తెలంగాణలో  బీసీ కులగణన చేయడం చరిత్రలో నిలిచిపోతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నేతనీలం  మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌‌ లోని జూబ్లీహిల్స్‌‌  లోని ముఖ్యమంత్రి నివాసంలో నీలం మధు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.  తెలంగాణలోని బీసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ..  దశాబ్దాలుగా బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నా రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం లేక చాలామంది నాయకులుగా ఎదగలేకపోయారన్నారు.

లంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ వర్గాలకు కులగణన పట్ల ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ బీసీలమంతా రుణపడి ఉంటామన్నారు.