ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్లడానికైనా రెడీ : నీలం మధు

ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్లడానికైనా రెడీ : నీలం మధు

ఏ పార్టీ  ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి తాను  సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్  నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. 2023 అక్టోబర్ 16 న బీఆర్ఎస్ కు  రాజీనామా చేయనున్నట్లుగా వెల్లడించారు.  పోస్టల్ బ్యాలెట్ లో ఈ సారి తప్పకుండా తన పేరుంటుందని, ఎమ్మెల్యేగా తాను  గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బిజేపి పార్టీ లు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు  టికెట్ ఇస్తే పార్టీ గుర్తుపై పోటీ చేస్తానని.. లేనిపక్షంలో స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పారు.  కార్యకర్తల అభిప్రాయాలు,అభిష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.  

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు నీలం మధు.  బీఆర్ఎస్ పార్టీ లో ఉద్యమంలో ఒక కార్యకర్తగా జెండా మోసి కష్టపడి పనిచేశానన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ఇంకా నమ్మకం ఉందని,  ప్రగతి భవన్ కు  పిలిచి మంత్రి హరీష్ రావు,బండ ప్రకాశ్ లు మాట్లాడినా ఇప్పటివరకు ఏలాంటి పిలుపు లేదన్నారు.  కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశాం. కానీ  వారు ముదిరాజ్ వర్గాన్ని పట్టించుకోలేదని చెప్పారు. గుడ్ మార్నింగ్ పటాన్ చెరు కార్యక్రమంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని నీలం మధు తెలిపారు.