పటాన్ చెరు టికెట్​పై సీఎం పునరాలోచించాలి: నీలం మధు ముదిరాజ్​

పటాన్ చెరు టికెట్​పై  సీఎం పునరాలోచించాలి: నీలం మధు ముదిరాజ్​

కౌడిపల్లి, వెలుగు : పటాన్ చెరు బీఆర్​ఎస్​ టికెట్​పై సీఎం కేసీఆర్​ పునరాలోచించుకోవాలని పటాన్​ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్, బీఆర్ఎస్ రాష్ట్ర లీడర్ ​నీలం మధు అన్నారు. ఆదివారం కౌడిపల్లి మండలం వెంకట్రావ్​ పేట నుంచి మండల కేంద్రమైన కౌడిపల్లి వరకు ముదిరాజ్​లు 200 బైక్​లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా హాజరైన మధును ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా పరంగా అధిక శాతంగా ఉన్న ముదిరాజ్​లకు న్యాయం చేయాలని, ఎన్నికల్లో నాలుగు సీట్లు కేటాయించాలని, అప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం సదాశివపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని పూజలు చేశారు.