జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి : నీలం మధు 

జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి : నీలం మధు 
  • సీఎం రేవంత్​రెడ్డికి నీలం మధు వినతిపత్రం అందజేత 

సంగారెడ్డి, వెలుగు: మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పూలే ఫొటోను బహూకరించి బీసీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు.

బీసీ కులగణన ద్వారా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు బీసీ  నాయకులు, ముఖ్య నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నీలం మధు జనాభా దామాషా ప్రకారం బీసీ లోని అన్ని కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం  రిజర్వేషన్లు కల్పించే అంశం సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

చిరకాలంగా ముదిరాజుల డిమాండ్ అయిన బీసీ డి నుంచి బీసీ ఏ లోకి  చేర్చాలని కోరారు. అనంతరం మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ  దీర్ఘ కాల డిమాండ్లను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

బీసీ కుల గణన చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అసెంబ్లీ లో చట్టబద్ధత కల్పిస్తున్నారని తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి త్వరలో రాజ్యాంగ అంశాలకు అనుగుణంగా బిల్లును ఆమోదించనున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ ముఖ్య నాయకులు  పాల్గొన్నారు.