హైదరాబాద్లో నీలాంబరి సిల్క్స్‌‌‌‌‌షురూ.. సినీనటి సంయుక్త మీనన్ చేత ప్రారంభం

హైదరాబాద్లో నీలాంబరి సిల్క్స్‌‌‌‌‌షురూ.. సినీనటి సంయుక్త మీనన్ చేత ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: నీలాంబరి సిల్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్​లో షోరూమ్​ను ప్రారంభించింది. సినీనటి సంయుక్త మీనన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా నీలాంబరి సిల్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్​ బొజ్జా పురుషోత్తం మాట్లాడుతూ ‘స్వచ్ఛమైన చేనేత పట్టు పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం మాది. ఆ అనుభవంతోనే నాణ్యత, ప్రామాణికత, వైవిధ్యంపైనే దృష్టి కేంద్రీకరించాం. 

మనదేశ చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయాలను పరిరక్షించడానికి మా బ్రాండ్ కట్టుబడి ఉంది.  కంచి, బనారస్, పైథాని, గద్వాల్, మంగళగిరి, వెంకటగిరి నారాయణపేట పట్టు చీరల అద్భుతమైన శ్రేణి  ఇక్కడ అందుబాటులో ఉంటుంది”అని ఆయన అన్నారు.  అందుబాటు ధరల్లో నాణ్యమైన చీరలను అందిస్తున్నామని వివరించారు.