దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా నీరజ్ అగర్వాల్

హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగర్వాల్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్‌‌‌‌కి చెందిన అధికారి. గతంలో ఎస్సీఆర్ పరిధిలోని నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా  పనిచేశారు. పశ్చిమ రైల్వేలో ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

తరువాత భారతీయ రైల్వేలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. నీరజ్ అగర్వాల్ బీఈ సివిల్ రాయ్‌‌‌‌పూర్‌‌‌‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో పూర్తి చేశారు.  భోపాల్‌‌‌‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్ నుండి పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌‌‌‌ను కూడా పూర్తిచేశారు.