
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆదివారం జరగనున్న పారిస్ డైమండ్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. గత రెండు నెలలుగా కాలి గాయంతో ఇబ్బందిపడుతున్న అతను ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ టోర్నీలో బరిలోకి దిగడం లేదు. ‘జావెలిన్ విసిరే టైమ్‌లో నా కాలిలో చిన్న ఇబ్బంది వస్తోంది. దాని వల్ల గజ్జలో నొప్పి కూడా అనిపిస్తున్నది. గజ్జపై ప్రభావం పడకుండా ఒత్తిడి తగ్గించేందుకు భిన్న రకాల డాక్టర్లతో సంప్రదింపులు చేస్తున్నాం’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.