- ఆరుగురు మహిళలకు చోటు
చండీగఢ్ : అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) తొమ్మిది మందితో ఏర్పాటు చేసిన అథ్లెట్స్ కమిషన్‌లో ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, లెజెండరీ షూటర్ గగన్ నారంగ్ సభ్యులుగా ఎంపికయ్యారు. లెజెండరీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ చైర్ పర్సన్‌గా ఉన్నా ఈ కమిషన్‌లో అత్యధికంగా ఆరుగురు మహిళలకు చోటు దక్కింది.
రన్నర్ జ్యోతిర్మయీ సిక్దర్, డిస్కస్ త్రోయర్ కృష్ణ పునియా, హర్డ్‌లర్ ఎండీ వల్సమ్మ, స్టీపుల్‌ఛేజర్ సుధా సింగ్, రన్నర్ సునితా రాణి సభ్యులుగా ఉన్నాయి. అంజు జార్జ్ ఏఎఫ్‌ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులోనూ కొనసాగుతోంది. పురుషుల కోటాలో నీరజ్, నారంగ్‌తో పాటు స్టీపుల్‌ఛేజర్ అవినాష్ సాబ్లే, ఏఎఫ్‌ఐ కొత్త ప్రెసిడెంట్ బహదూర్ సింగ్ కూడా ఉన్నారు.