గాయం కారణంగా 11 నెలల భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్న టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఐర్లాండ్ T20 సిరీస్‌లో పునరాగమనం చేసిన బుమ్రా తన ఫామ్ ను ఆసియా కప్, వరల్డ్ కప్ లో కొనసాగించాడు. పెద్దగా రన్ అప్ లేకుండానే బుమ్రా 140 కి పైగా బంతులను విసురుతున్నాడు. అయితే బుమ్రా తన బౌలింగ్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మరింత వేగంతో బౌలింగ్ చేయగలడని భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కీలక సలహా ఇచ్చాడు.
నీరజ్ చోప్రా మాట్లాడుతూ "నాకు జస్‌ప్రీత్ బుమ్రా అంటే ఇష్టం. అతని యాక్షన్‌ని నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను. అతను మరింత వేగం పెంచేందుకు తన రన్-అప్‌ను పొడిగించాలని నేను భావిస్తున్నాను. జావెలిన్ త్రోయర్‌గా, బౌలర్లు తమను ఎలా పెంచుకోవాలో తరచుగా చర్చిస్తాం. బుమ్రా కొంచెం వెనుక నుండి తన రన్-అప్ ప్రారంభిస్తే పేస్ లో మరింత వేగాన్ని పెంచుకోవచ్చు". అని తెలియజేశాడు. గతంలో పలువురు మాజీలు సైతం బుమ్రా మరింతగా రనప్ తీసుకోవాల్సిందిగా సూచించారు.
నీరజ్ చోప్రా 2021 టోక్యో గేమ్స్‌లో జావలింగ్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచాడు. అభినవ్ బింద్రా తర్వాత ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చిన ప్లేయర్ నీరజ్ చోప్రా. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రన్నరప్ గా రజతంతో సరిపెట్టుకున్నాడు.
Neeraj Chopra names Jasprit Bumrah as his favourite fast bowler pic.twitter.com/aySYfyeDrA
— RVCJ Media (@RVCJ_FB) December 4, 2023