అందాల భామ మెడలో మూడు ముళ్లు.. పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా..

అందాల భామ మెడలో మూడు ముళ్లు.. పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా..

డబుల్ ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. హిమని(Himani) అనే వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు. రెండు రోజుల క్రితం అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ వివాహం జరిగింది. సోనీపట్ ప్రాంతానికి చెందిన హిమానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.

నీరజ్ పెళ్లికి సంబంధించిన  చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో తన భార్యతో కలిసి కనిపిస్తున్నాడు. ‘‘నా కుటుంబంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను..’’ అని నీరజ్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. 

గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. రజతం సాధించిన నీరజ్ ను జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా అమెరికన్ మ్యాగజైన్ 'ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్' 2024లో ప్రకటించింది.

Olympian javelin thrower Neeraj Chopra ties the knot with Himani

"Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after." tweets Neeraj Chopra pic.twitter.com/Ug2p9fU9Kc

— ANI (@ANI) January 19, 2025