
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన 26 ఏళ్ల నీరజ్.. పారిస్‌లో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్‌లో మొత్తంగా ఆరు సార్లు బల్లెం విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు.
మిగతా ఐదు ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించాడు. ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు 90.57 మీటర్లుగా ఉంది. బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ ఈ ఫీట్ సాధించాడు.