వరల్డ్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ టూర్‌లో.. నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రాకు గోల్డ్‌

వరల్డ్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ టూర్‌లో.. నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రాకు గోల్డ్‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రోయర్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రా ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ను ఘనంగా ఆరంభించాడు. పోట్చ్‌‌‌‌‌‌‌‌ ఇన్విటేషన్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా బుధవారం రాత్రి వరల్డ్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్‌‌‌‌‌‌‌‌లో నీరజ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్ నెగాడు.  తన జావెలిన్‌ను చోప్రా 84.52 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్ సాధించాడు.  అయితే తన పర్సనల్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ (83.29 మీ)ను మాత్రం అధిగమించలేకపోయాడు. 

సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (82.44 మీటర్లు) రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో రజతం సొంతం చేసుకున్నాడు. ఆరుగురు త్రోయర్లు పాల్గొన్న ఫైనల్లో నీరజ్‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌ మాత్రమే 80 మీటర్ల మార్క్‌‌‌‌‌‌‌‌ను క్రాస్‌‌‌‌‌‌‌‌ చేశారు. సౌతాఫ్రికాకే చెందిన డంకన్‌‌‌‌‌‌‌‌ రాబర్ట్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ (71.22 మీటర్లు)  కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త కోచ్‌‌‌‌‌‌‌‌ జాన్‌‌‌‌‌‌‌‌ జెలెంజీ (చెక్‌‌‌‌‌‌‌‌)తో ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న నీరజ్‌‌‌‌‌‌‌‌.. మే 16న జరిగే దోహా డైమండ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాడు.