ఆయిల్ పామ్ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్​గా నీరజ ప్రభాకర్

ఆయిల్ పామ్ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్​గా నీరజ ప్రభాకర్

హైదరాబాద్‌‌, వెలుగు : కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్- చాన్స్​లర్  డాక్టర్ బి నీరజ ప్రభాకర్ ఏపీలోని భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి హార్టికల్చర్‌‌  విజ్ఞాన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. 

భవిష్యత్తులో ఇండియాలో ఆయిల్ పామ్ పంట పరిశోధనకు సంబంధించిన సలహాలు, సూచనలు నీరజ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. మూడేండ్ల పాటు ఆమె చైర్మన్ గా 
కొనసాగనున్నారు.