రాష్ట్రంలో 112 సెంటర్లు.. హాజరు కానున్న 55,800 మంది
3,843 సెంటర్లలో పరీక్ష రాయనున్న 15 లక్షల మంది
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎగ్జామ్
హాల్‌లో తామిచ్చిన మాస్కులు పెట్టుకోవాలన్న ఎన్‌టీఏ
న్యూఢిల్లీ: కరోనా ప్రికాషన్స్ మధ్య నీట్ పరీక్ష ఆదివారం జరగబోతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 55,800 మంది, దేశవ్యాప్తంగా సుమారు 15.97 లక్షల మంది స్టూడెంట్లు హాజరవబోతున్నారు. రాష్ట్రంలో 112 సెంటర్లు, దేశ్యాప్తంగా 3,843 సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లున్నాయి. నిర్ణీత టైమ్‌కు 3 గంటల ముందే స్టూడెంట్లను సెంటర్లలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరగనుంది.
సెంటర్లు పెంచి..
కరోనా వల్ల ఎగ్జామ్ సెంటర్లను 2,546 నుంచి 3,843కు పెంచామని, ఒక్కో రూమ్‌కు క్యాండిడేట్లను 24 నుంచి 12కు తగ్గించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర.. బయట వెయిట్ చేసే టైమ్‌లోనూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేశామంది. అవసరమైన ప్రతి చోట శానిటైజర్లను సిద్ధం చేశామని తెలిపింది. అడ్మిట్ కార్డుల చెకింగ్‌కు బదులు ఈసారి బార్ కోడ్ రీడింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చామని చెప్పింది. క్యాండిడేట్లందరూ మాస్కులు, శానిటైజర్లతో ఎగ్జామ్ సెంటర్‌కు రావాలని సూచించింది. సెంటర్‌లోకి వచ్చాక సిబ్బంది ఇచ్చే మాస్కులు వాడాల్సి ఉంటుందని వివరించింది. క్యాండిడేట్లు అందరికీ మూడు లేయర్ల మాస్కులను అందిస్తామంది.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా
ఎగ్జామ్‌కు వెళ్లే స్టూడెంట్లకు రవాణా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని ఎన్‌టీఏ చెప్పింది. కొవిడ్ వల్ల కొందరి ఎగ్జామ్ సెంటర్లను కూడా ఎన్‌టీఏ మార్చింది. అయితే ఎగ్జామ్ రాసే సిటీని మాత్రం చేంజ్ చేయలేదు. మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు స్టూడెంట్లకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పాయి. ఐఐటీకి చెందిన కొందరు స్టూడెంట్లు ఎగ్జామ్ సెంటర్లకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కోసం ఓ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. నీట్ రాసే వాళ్ల కోసం కోల్‌కతా మెట్రో రైల్వే స్పెషల్ మెట్రో సర్వీసులను నడిపిస్తోంది. కరోనా వల్ల ఇప్పటికే రెండు సార్లు ఎగ్జామ్‌ను వాయిదా వేశారు. పరీక్షను పోస్ట్‌పోన్ చేయాలని ఇటీవల కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా స్టూడెంట్లకు ఒక సంవత్సరం వేస్ట్ అవుతుందంటూ పిటిషన్‌ను కొట్టేసింది.
For More News..