హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రతిసారి ఈజీగా వచ్చే ఫిజిక్స్ ప్రశ్నలు ఈసారి టఫ్‌గా వచ్చాయని స్టూడెంట్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ప్రశ్నలు లెంతీగా ఉండడంతో ఇబ్బంది పడ్డామని విద్యార్థులు చెప్పారు. టఫ్‌గా ఇచ్చే కెమిస్ట్రీ పేపర్ కూడా ఈసారి కొంత ఈజీగా ఇచ్చారని వెల్లడించారు.
బాటనీ, జువాలజీలో ప్రశ్నలు సులువుగా ఉన్నాయన్నారు. ఫిజిక్స్ తప్ప మిగతా 3 సబ్జెక్టులు ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఉన్నాయని, ఓవరాల్‌గా పేపర్ యావరేజ్‌గా వచ్చిందని తెలిపారు. కాగా, గతంలో 450 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చిందని, ఈసారి 430 నుంచి 440 మధ్య మార్కులు వస్తే సీటు రావొచ్చని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. నిరుడు జనరల్ కోటా కటాఫ్ 137, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోటా కటాఫ్ 107గా ఉంది.