నీట్ పేపర్ లీక్ కేసులో రాఖీ అరెస్ట్.. పల్లీబఠానీల్లా అమ్మింది వీడే

నీట్ పేపర్ లీక్ కేసులో రాఖీ అరెస్ట్.. పల్లీబఠానీల్లా అమ్మింది వీడే

NEET paper leak: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది సీబీఐ. నీట్ యూపీ పరీక్ష పేపర్లను అభ్యర్థులకు అమ్మిన నిందితుతుడు రాఖేష్ రంజన్ ను గురువారం (జూలై 11) రాంచీలో అరెస్ట్ చేసింది. బీహార్ లోని నవదా కు చెందిన రాఖేష్ రంజన్ ను సీబీఐ అధికారులు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఉపయోగించి ఐపీ అడ్రస్ ద్వారా ఆచూకీ తెలుసుకొని పట్టుకున్నారు. 

గత కొన్నేళ్లుగా రాంచీలో  స్థిరపడిన రాఖేష్.. ఓ రెస్టారెంట్ నడుపుతూ నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు. పేపర్ తనకు దగ్గర చేరగానే.. ఎగ్జామ్ పేపర్ తోపాటు ఆన్సర్లను కూడా చింటూ అనే మరో నిందితుడి మొబైల్ కు పంపినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.

వివిధ రాష్ట్రాల్లో సీబీఐ తనిఖీలు 

రాఖేష్ రంజన్ ను పట్టుకునేందుకు సీబీఐ అధికారులు వివిధ రాష్ట్రాల్లో అనేకసార్లు తనిఖీలు చేశారు. పాట్నా, కోల్ కతాలతో పాటు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ తో  రాఖేష్ ఐపీ అడ్రస్ ఆధారంగా అతనిని గుర్తించారు సీబీఐ అధికారులు. రాఖేష్ తన భార్యకు పంపిన ఈమెయిల్స్ తో అతని ఆచూకీ తెలుసుకున్నారు. 

రాఖేష్ కు పదిరోజుల సీబీఐ కస్టడీ 

నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు రాఖేష్ ను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరు పర్చారు సీబీఐ అధికారులు. నిందితుడిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు 10రోజులు కస్టడీకి అనుమతించింది. వైద్య పరీక్షల అనంతరం రాఖేష్ ను సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది.