NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష రీషెడ్యూల్ విడుదలయ్యింది. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ నిర్వహిం చేందు కు తేదీలను శుక్రవారం( జూలై 5) ప్రకటించారు. ఆగస్టు 11 న నీట్ పీజీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. రెండు షిఫ్టులలో జరుగుతుంది.
ఇటీవల నీట్ యూజీ పేపర్ లీక్, పోటీ పరీక్షలల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల క్రమంలో ఎన్ బీఈఎంఎస్ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 52 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల కోసం ప్రతి ఏడాది దాదాపు రెండు లక్షల మంది ఎంబీబీఎష్ గ్రాడ్యుయేట్లు నీట్ పరీక్ష రాస్తుంటారు.
పరీక్షా నిర్వహిణ విధానం పటిష్టంగా ఉండాలని, ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరున సందర్భంగా బోర్డు నీట్ పీజీ పరీక్షను రద్దు చేసింది. NEET PG 2024లో హాజరు కావడానికి అర్హత కోసం కటాఫ్ తేదీ ఆగస్టు 15, 2024లో ఎలాంటి మార్పు లేదు.