నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) 2024–-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్)లో అడ్మిషన్స్‌కు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్/ పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
- ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
- అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 6 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.natboard.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.