ఢిల్లీ : పీజీ మెడికల్ అడ్మిషన్స్కు సంబంధించి నీట్ కౌన్సెలింగ్పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. జనవరి 12 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తేదీలు ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా చెప్పారు. మెడికల్ పీజీ కౌన్సెలింగ్ కు హాజరయ్యే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
నీట్ పీజీ అడ్మిషన్లలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటాను పున సమీక్షించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. అడ్మిషన్ల విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు నిరసన చేపట్టడంతో.. అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను జాతీయ ప్రయోజనంగా భావించి త్వరగా ఆ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో 50శాతం సీట్లు భర్తీ చేయనున్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 100 శాతం సీట్ల అడ్మిషన్ ఈ కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతుంది.
NEET PG Counselling to start from 12 Jan: Union Health Minister Mansukh Mandaviya
— ANI (@ANI) January 9, 2022
(File pic) pic.twitter.com/g0S8XXktd2
మరిన్ని వార్తల కోసం..