నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేసింది. ఈ కేసుతో సంబంధమున్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తోంది.నీట్ పేపర్ లీక్ కేసుతో సంబంధమున్న కొందరు నిందితులను గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ కి అప్పగించడంతో రంగంలోకి దిగిన అధి కారులు రెండు రోజుల క్రితం బీహార్ లోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ( జూన్ 29) నీట్ పేపర్ లీక్ కేసుతో సంబంధమున్న జార్ఖండ్ కు చెందిన ఓ జర్నలిస్టును సీబీఐ అరెస్ట్ చేసింది.
జమాలుద్దీన్ అనే జర్నలిస్టును జార్ఖండ్ లోని హజారీ బాగ్ లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గుజరాత్ లోని గోద్రా, ఖేడా, ఆనంద్, అహ్మదాబాద్ సహా ఏడు చోట్లు సీబీఐ సోదాలు చేసింది. జూన్ 27 న బీహా ర్ లో నీట్ యూపీ పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మనీష్ ప్రకాష్ తోపాటు అశుతోష్ అనే వ్యక్తిని పాట్నాలో అరెస్ట్ చేశారు.
నీట్ పరీక్షకు ఒక రోజు ముందు అంటే మే 4న పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్ కు చెందిన హాస్టల్ లో అశుతోష్ సహాయంతో మనీష్ ప్రకాష్ అభ్యర్థులకు లీక్ అయిన పేపర్లు, ఆన్సర్ల కీ ఇచ్చినట్లు సీబీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జూన్ 29న నీట్ పేపర్ లీక్ కు సంబంధించి జార్ఖండ్ లోని హజారీ బాగ్ లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సి పాల్, వైస్ ప్రిన్సిపాల్ ను జూన్ 29న సీబీఐ అరెస్ట్ చేశారు అధికారులు.
నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన మొత్తం ఆరు కేసులను సీబీఐ విచారిస్తోంది. ఆరు కేసుల్లో ఒకటి బీహార్, ఒకటి గుజరాత్, ఒకటి మహారాష్ట్ర నుంచి దర్యాప్తు చేస్తుండగా మూడో రాజస్థాన్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సీబీఐ అధికారులు.