ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం: నీట్ విద్యార్థినిపై కోచింగ్ టీచర్ల అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం: నీట్ విద్యార్థినిపై కోచింగ్ టీచర్ల అత్యాచారం

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లోని కాన్పూర్‎లో దారుణం జరిగింది. నీట్‌‌ మెడికల్‌‌ ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ కోసం కాన్పూర్‌‌కు వెళ్లిన ఓ బాలికను కోచింగ్‌‌ సెంటర్‌‌కు చెందిన ఇద్దరు టీచర్లు రేప్ చేశారు. ఆపై వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. 

ఇద్దరు టీచర్లలో ఒకరు మరో విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న వీడియో వైరల్ కావడంతో నీట్ ఆస్పిరెంట్ కూడా ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరు టీచర్లు పోలీసుల అదుపులో ఉన్నారు.  ఫిర్యాదు ప్రకారం.. మైనర్ విద్యార్థిని 2022లో నీట్‌‌ మెడికల్‌‌ ఎంట్రన్స్ టెస్ట్ కు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లింది. 

బాలిక కోచింగ్ తీసుకుంటున్న సెంటర్‎లోని బయాలజీ టీచర్  సాహిల్ సిద్దిఖీ(32).. ఈ ఏడాది జనవరిలో తన ఇంట్లో జరిగే న్యూఇయర్ పార్టీకి రావాలని ఆమెను ఇన్వైట్ చేశాడు. దాంతో ఆమె మక్డీ ఖేడాలోని ఫ్లాట్‌‌కు వెళ్లింది. ఆ టైంలో మద్యం తాగించి, ఆ మత్తులో ఉండగా 
అత్యాచారం చేశాడు. దానిని వీడియో తీసి ఆ తర్వాత బెదిరిస్తూ నెలల తరబడి అఘాయిత్యం చేశాడు.