నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET UG ) 2024 ఇంతవరకు అప్లై చేసుకోనివారికి గుడ్ న్యూస్. ఇంటర్ విద్యార్హతతో మెడిసిన్ చదవాలనుకునే వారు నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. మంచి గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్, డెంటల్, యునాని, హోమియోపతి, వెటర్నరీ, ఆయుర్వేదం, నర్సింగ్ చదవాలనుకుంటే ఇందులో స్కోర్ చేయాలి. NEET యూజీ 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల (మార్చి 9) రాత్రితో అప్లికేషన్ గడువు ముగియనుండగా.. మార్చి 16 వరకూ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు NTA ప్రకటించింది.
నీట్ ఎగ్జామ్ మే 5న దేశవ్యాప్తంగా జరగనుంది. మొత్తం 13 భాషల్లో ఆఫ్ లైన్ విధానంలో నీట్ పరీక్ష ఉంటుంది. శనివారం నాటికి 25లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 4.2 లక్షలకుపైగా దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 2 లక్షల సీట్లు ఉండగా 13లక్షల మందికి పైగా యువతులు నీట్ కు అప్లై చేసుకున్నారు. అప్లికేషన్ డేట్ పెంచడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా.
neet ug applications,neet ug 2024 updates,neet ug 2024 latest news,neet ug 2024 extended deadline,neet ug 2024 application numbers,neet ug 2024,telugunews,latesttelugunews,v6news,jobs and education updates in telugu