ఓఎంఆర్ ​పద్ధతిలోనే నీట్​ యూజీ ఎగ్జామ్

ఓఎంఆర్ ​పద్ధతిలోనే నీట్​ యూజీ ఎగ్జామ్
  • దేశమంతా ఒకేరోజు ఒకే షిఫ్ట్​లో వైద్య విద్య ఎంట్రెన్స్​ టెస్ట్​
  • ప్రకటించిన కేంద్ర సర్కారు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్​ యూజీ–2025 పరీక్షను పెన్​ అండ్​ పేపర్​ (ఓఎంఆర్) పద్ధతిలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దేశమంతా ఒకేరోజు ఒకే షిఫ్ట్​లో ఎగ్జామ్​ ఉంటుందని ప్రకటించింది. కేంద్ర విద్య, ఆరోగ్య శాఖలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ‘‘నేషనల్​ మెడికల్​కమిషన్​ (ఎన్ఎంసీ) నిర్ణయం ప్రకారం.. నీట్​ యూజీ –2025ను ఓఎంఆర్​ పద్ధతిలో నిర్వహిస్తాం.

 ఒకే రోజు.. ఒకే షిఫ్ట్​లో పరీక్ష ఉంటుంది” అని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) సీనియర్​ అధికారి తెలిపారు. కాగా, 2024లో మొత్తం 24 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. నిరుడు పేపర్​ లీక్​ల నేపథ్యంలో ఈసారి పరీక్షను  కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​ విధానంలో  నిర్వహించే అవకాశాలున్నట్టు ఇదివరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు.  కస్తూరి రంగన్‌‌‌‌  ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సైతం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ విధానంలో నీట్‌‌‌‌ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా జరిగిన చర్చల తర్వాత ఓఎంఆర్‌‌‌‌ పద్ధతికే మొగ్గు చూపడంతో.. పాత పద్ధతిలోనే నీట్​ యూజీ 2025 ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది.