నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. రీసెంట్‌గా ఫస్ట్ సాంగ్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. మంగళవారం (అక్టోబర్ 29) రెండో పాటను రిలీజ్ చేసింది.
‘నీతో ఇలా.. ఆగే ఆగే కాలం నీతో.. ఊగే ఊగే లోకం నీతో.. సాగే సాగే హాయే నీతో..’ అంటూ సాగిన పాటలో నిఖిల్, దివ్యాంశ కౌశిక్ స్టైలిష్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఫారిన్‌లో చిత్రీకరించిన పాటలో తమదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు.
రాకేందు మౌళి లిరిక్స్ రాయగా, కార్తీక్ కంపోజ్ చేయడంతో పాటు నిత్యశ్రీతో కలిసి పాడాడు. నవంబర్ 8న సినిమా విడుదల కానుంది. స్వామిరారా, కేశవ చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.