- రాష్ట్రంలో ఎడ్యుకేషన్, హెల్త్ బాగలేవ్
- నీతిఆయోగ్ అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో తెలంగాణ సర్కారు పనితీరు సరిగ్గా లేదని నీతి ఆయోగ్ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రగతి భవన్లో శుక్రవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమైన నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ బృందం వివిధ రంగాల్లో రాష్ట్ర సర్కారు పనితీరుపై చర్చించింది. ఇందులో భాగంగా హెల్త్, ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. టీచర్ల రిక్రూట్మెంట్ లేకపోవడం, ప్రొఫెసర్లు, యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను నియమించకపోవడం, ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని చెప్పినట్లు సమాచారం. లిటరసీ తక్కువగా ఉండడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కరోనా టైంలో టెస్టులు సరిగ్గా చేయలేదని తెలిపారు. నర్సుల రిక్రూట్మెంట్ లేదని, పీహెచ్‌సీల స్థాయిలో ప్రజలకు మంచి వైద్యం అందించడంలో ఫెయిల్ అవుతున్నారని, సీరియస్‌గా పనిచేయాలని సూచించారు. మండల స్థాయిలో ఎమర్జెన్సీ సర్వీసులు అందేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ, రైతులకు ఉచిత కరెంట్ పథకాలను నీతిఆయోగ్ టీమ్ ప్రభుత్వాన్ని అభినందించింది.
For More News..