దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు: హీరో విజయ్

దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు: హీరో విజయ్

నీట్‌లో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో దేశానికి దాని అవసరం లేదని తమిళగ వెట్రి కజగం చీఫ్, నటుడు విజయ్ అన్నారు.  చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ..  ప్రజలు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారు. తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ పాస్ చేసిన తీర్మానాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు . తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.  

రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దని కేంద్రానికి  విజ్ఞప్తి చేశారు. విద్యను ఉమ్మడి(కేంద్రం, రాష్ట్రం) జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలని విజయ్ చెప్పారు. నీట్‌ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారన్నారు.   కాగా డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి విల్సన్ నీట్‌ పరీక్షను రద్దు చేయాలని లేదా తమిళనాడు రాష్ట్రాన్ని పోటీ పరీక్షల నుండి మినహాయించే నీట్ మినహాయింపు బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.