సిద్ధిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. తుమ్మ సురేష్ అనే వ్యక్తి నాలుగురోజుల క్రితం(2023 జులై 28 శుక్రవారం) రోడ్డు ప్రమాదంలో గాయపడి చేర్యాల ప్రభుత్వ హస్పిటల్ కు వచ్చాడు. అయితే చేతిలో ఉండిపోయిన గాజు ముక్కలను తొలగించకుండానే కుట్లు వేశారు ఆసుపత్రి సిబ్బంది. చేతికి ఇన్ ఫెక్షన్ రావడంతో స్కానింగ్ చేయించాడు బాధితుడు. చేతిలో ఐదు గాజు ముక్కలు ఉండడంతో RMP డాక్టర్ సాయంతో ఒక గాజు ముక్కను తొలగించారు.
దీంతో డ్యూటీ డాక్టర్ కు , బాధితుని కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చికిత్స విషయమై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితుని కుటుంబ సభ్యులు.