ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం.. మూడు నెలల బాలుడు మృతి !

ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం.. మూడు నెలల బాలుడు మృతి !

ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందాడు.  ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురంలో చోటుచేసుకుంది. రంగపురం గ్రామానికి చెందిన భూక్య బీరన్న మహేశ్వరి దంపతుల చిన్న కుమారుడు పండు(3నెలలు) జ్వరం రావడంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు భూక్యా హాలు వద్దకు తీసుకెళ్లారు.  బాలుడిని పరక్షించిన డాక్టర్ భూక్యహాలు... రెండు ఇంజెక్షన్ల వేసి ఇంటికి పంపించాడు.

ఇంటికి తీసుకుని వచ్చిన కొద్ది సేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడి మృతికి ఆర్ఎంపీ డాక్టరే కారణమని, ఆయన చేసిన ఇంజెక్షన్ వికటించి బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ వైద్యునిపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని చిన్నారి బంధువులు కోరుతున్నారు.