పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. విద్యాశాఖ ఆదేశాలు

 పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. విద్యాశాఖ ఆదేశాలు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలపై సెక్రటేరియట్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.  మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లను టెక్స్ట్ బుక్స్ లోని ముందుమాటలో ముద్రించి పంపిణీ చేశారు అధికారులు.  దీంతో విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఒకటి నుండి పదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ముందు మాటలో గత ముఖ్యమంత్రి,  విద్యా శాఖ మంత్రి పేర్లను ముద్రించారు సెక్రటేరియట్అధికారులు. తాజా ఆదేశాలతో ముందు మాట పేజీలను తొలగించి కొత్త పేజీలను ముద్రిస్తు్ంది విద్యాశాఖ.  జూన్ 15 లోపు విద్యార్థులందరికీ  తెలుగు టెక్స్ట్ బుక్స్ అందించనుంది విద్యాశాఖ.   రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్‌లు పంపిణీ చేశారు.  తాజాగా వాటిని వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.