- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యం
- కొరవడిన ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ
- నెలలుగా మేడ్చల్, మాదాపూర్జోన్ ట్రాఫిక్ డీసీపీ పోస్టులు ఖాళీ
- అన్నీ తానై చూస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్పరిధిలో రాత్రి 8 గంటల తర్వాత ట్రాఫిక్పోలీసులు కనిపించడం లేదు. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీకెండ్స్‌లో మినహా ఐటీ కారిడార్రోడ్లు 24 గంటలూ రద్దీగా ఉంటున్నాయి. రోజూ వేల సంఖ్యలో వెహికల్స్రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్నిలుస్తోంది. చీకటి పడిన దాకా జంక్షన్లలో, సిగ్నల్స్‌వద్ద డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్పోలీసులు, కొన్ని నెలలుగా రాత్రి 8 గంటల తర్వాత కనిపించడం లేదు.
దీంతో వాహనదారులు సిగ్నల్స్జంప్చేయడంతోపాటు, ఓవర్‌స్పీడుతో వెళ్తున్నారు. కొద్ది నెలలుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు జోన్ల ట్రాఫిక్ డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాదాపూర్, మేడ్చల్ట్రాఫిక్ జోన్ డీసీపీలుగా బదిలీపై వెళ్లగా ప్రభుత్వం వారి స్థానంలో కొత్త డీసీపీలను నియమించలేదు. ఇదే అలుసుగా కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రద్దీగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందానగర్, హఫీజ్‌పేట ఏరియాల్లో ట్రాఫిక్సిబ్బంది ఉండడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు.
రెండు జోన్ల మానిటరింగ్
పెరుగుతున్న ఐటీ కంపెనీలు, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2023లో రాష్ట్ర ప్రభుత్వం సైబరాబాద్కమిషనరేట్లో రెండు ట్రాఫిక్ డీసీపీ జోన్లను ఏర్పాటు చేసింది. మాదాపూర్జోన్ ట్రాఫిక్ డీసీపీగా హర్షవర్థన్, మేడ్చల్ జోన్ట్రాఫిక్ డీసీపీగా శ్రీనివాసరావును నియమించింది. కొన్ని నెలల కింద మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్థన్ బదిలీపై వెళ్లగా మేడ్చల్ జోన్ డీసీపీ శ్రీనివాసరావుకు ఇన్చార్జ్బాధ్యతలు అప్పగించారు.
ఈ ఏడాది జూన్17న జరిగిన బదిలీల్లో శ్రీనివాసరావును ప్రభుత్వం కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా ఎస్పీగా నియమించింది. అప్పటి నుంచి మాదాపూర్, మేడ్చల్ జోన్లకు ట్రాఫిక్ డీసీపీలు లేరు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్సీపీ జోయల్డేవిస్రెండు జోన్లను మానిటరింగ్చేస్తున్నారు.