ఉక్రెయిన్తో ఫలించిన చర్చలు..! వెనక్కి తగ్గిన రష్యా..!

  • బలగాల ఉపసంహరణకు అంగీకరించిన రష్యా 
  • జెనీవా ఒప్పందాలకు కట్టుబడి ఉంటామన్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ – రష్యా మధ్య దాడులకు దాదాపు ఎండ్ కార్డ్ పడింది. ఇన్నాళ్లకు రెండు దేశాల చర్చల్లో పురోగతి వచ్చింది. కీవ్, చెర్నిహివ్ నుంచి బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించింది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని చెప్పారు రష్యా రక్షణశాఖ మంత్రి అలెగ్జాండర్ ఫొమిన్. జెనీవా ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని ఉక్రెయిన్ చెప్పిందన్నారు. ఇక.. సమస్య పూర్తిగా సమసిపోయే వరకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నారు టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్. త్వరలోనే పుతిన్, జెలెన్ స్కీ భేటీ కూడా ఉంటుందన్నారు. 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

రోజు రోజుకూ ముదురుతున్న ఎండలు